జై భీమ్..మరో అరుదైన ఫీట్

103
surya
- Advertisement -

హీరో సూర్య స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం జై భీమ్. ఓటీటీలో రిలీజైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలే కాదు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఇప్పటివరకు జాతీయ స్ధాయిలో ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం తాజాగా ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో ఎంట్రీ ఇచ్చింది.

గోల్డెన్ గ్లోబ్స్ 2022లోకి ప్రవేశించి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇరులర్ తెగకు చెందిన సెంగాని భర్త రాజకన్నును తప్పుడు కేసులో ఇరికించినప్పుడు, సెంగాని (పార్వతి జీవితం ఆధారంగా), న్యాయవాది చంద్రు నేతృత్వంలోని కీలక న్యాయ పోరాటానికి సంబంధించి సినిమాఉ తెరకెక్కించారు. ఈ కేసులో పోలీసుల దౌర్జన్యం కారణంగా 1993లో రాజకన్ను మరణించాడు.

ఈ చిత్రం ‘ది షావ్‌శాంక్ రిడంప్షన్’, ‘ది గాడ్‌ ఫాదర్’ ఐఎండిబిలో రికార్డు స్థాయి రేటింగ్‌లను బ్రేక్ చేసి మొదటి స్థానంలో 9.6 రేటింగ్ తో నిలిచి అరుదైన ఘనత సాధించింది.

- Advertisement -