ధోని కెప్టెన్సీ…చెన్నై గెలుపు

100
csk
- Advertisement -

మహేంద్రసింగ్ ధోని తిరిగి చెన్నై కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి మ్యాచ్‌లోనే గ్రాండ్ విక్టరీ కొట్టింది. చెన్నై విధించిన 203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్..20 ఓవర్లలో 6 వికెట్లకు 189 పరుగులు చేసింది. దీంతో చెన్నై 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. విలియమ్సన్‌ (47), అభిషేక్‌ (39) రాణించారు. మిగితా బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు.

ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కొల్పోయి 202 పరుగులు చేసింది. ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (57 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 99), డెవాన్‌ కాన్వే (55 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 85 నాటౌట్‌) తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగారు. ఐపీఎల్ చరిత్రలోనే తొలివికెట్‌కు 182 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నమోదుచేశారు. భారీ భాగస్వామ్యం ముగిసింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా రుతురాజ్‌ నిలిచాడు.

- Advertisement -