వానాకాలానికి 24.45 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల కేటాయింపు..

42
- Advertisement -

వానాకాలానికి 24.45 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను కేటాయించినట్లు తెలిపారు మంత్రి నిరంజన్ రెడ్డి.హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో వానాకాలం ఎరువుల సరఫరాపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన నిరంజన్ రెడ్డి…9.4 లక్షల మెట్రిక్ టన్నులు కాంప్లెక్సు ఎరువులు,2.3 లక్షల మెట్రిక్ టన్నులు డీఎపీ,2.25 లక్షల మెట్రిక్ టన్నులు ఎంఓపీ మరియు ఎస్ఎస్ పీ,మే నెలాఖరు నాటికి 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సిద్దంగా ఉంచాలన్నారు.రాష్ట్రానికి అవసరమైన డీఏపీ, కాంప్లెక్సు ఎరువులు జూన్ 15 నాటికి సిద్దంచేయాలన్నారు.

మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో సీజన్ ముందే ప్రారంభమవుతుంది .. ఈ నేపథ్యంలో పక్కా ప్రణాళికతో అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు.రష్యా – ఉక్రెయిన్ యుద్దం నేపథ్యంలో ఎరువుల తయారీకి అవసరమైన ముడి సరుకుల కొరతను సాకుగా చూపి కేంద్రం రాష్ట్రాలకు ఎరువుల సరఫరాను జాప్యం చేస్తున్నాయి .. రైతుల శ్రేయస్సు కేంద్రానికి ఇది ఏమాత్రం సముచితం కాదన్నారు.

అందుకే రాష్ట్రానికి అవసరమైన ఎరువుల కోసం కేంద్ర ఎరువులు, రసాయన శాఖకు లేఖ రాశామని…వివిధ పోర్టుల్లో అందుబాటులో ఉన్న డీఎపీ, కాంప్లెక్సు ఎరువులు తెలంగాణకు పంపించాలన్నారు. రైతులు ఎరువులు మూస పద్దతిలో కాకుండా పంటకు అవసరమైన మేరకు, నేలలో పోషకాల లభ్యతను బట్టి
వ్యవసాయ అధికారుల సూచనల మేరకు వినియోగించాలన్నారు. భూసార పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని…నేల ఆరోగ్యం మీద రైతులు శ్రద్దుపెట్టాలి .. ప్రభుత్వం అందించే పచ్చిరొట్ట ఎరువులు వినియోగించాలన్నారు.

- Advertisement -