హ్యాపీ బర్త్ డే టు మోహన్‌బాబు

525
mohan babu
- Advertisement -

సినిమాలో హీరో నెంబర్ వన్‌గా ప్రేక్షకులు సినిమాలు చూడాలనుకునే రోజుల్లో విలన్‌గా తనదైన ముద్రవేసి, ప్రతి నాయకుడంటే అలా ఉండాలి అనుకునేలా మెప్పించిన నటుడు కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు. విలక్షణ విలనీజాన్ని పండించాలన్నా, అన్యాయాన్ని తుదముట్టించే హీరో క్యారెక్టర్ చేయాలన్నా, రసిక రాజశేఖరుడి పాత్రనైనా, భక్తి పారవశ్యంలో మునిగితేలే తిరుమలరాయుడుగా మెప్పించాలన్నా ఆయనకే చెల్లింది. ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం ఆయన నైజం. క్రమశిక్షణకు మారుపేరు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ ను స్థాపించి ఎందరికో ఆసారాగా నిలిచిన మోహన్ బాబు బర్త్ డే నేడు.

maxresdefault

మోహన్ బాబు అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు. 1952 మార్చి 19న చిత్తూరు జిల్లా మోదుగులపాలెంలో జన్మించారు. యేర్పేడు గ్రామం మరియి తిరుపతి లో తన పాఠశాల విద్యను అభ్యసించిన అనంతరం మోహన్ బాబు ఉన్నత విద్య కోసం చెన్నైకి వెళ్లారు.

Image result for మోహన్ బాబు బర్త్ డే greattelangaana

ఓ పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ మాస్టర్ గా కొంత కాలం పని చేసిన మోహన్ బాబు మనస్సు మాత్రం ఎప్పుడు సినిమా పరిశ్రమ పైనే ఉండేది. మొదట్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురుకున్న మోహన్ బాబుకి 1975 లో డా దాసరి నారాయణరావు గారు ‘స్వర్గం నరకం’లో తొలి అవకాశం ఇచ్చారు. ఈ సినిమా తోనే అయన పేరు బక్తవత్సలం నాయుడు నుండి మోహన్ బాబుగా మరిపొయింది.

image_14599994175705d2b926d31

స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి తరువాత డైలాగులు చెప్పడంలో దిట్ట అని డైలాగ్ కింగ్ గా పేరు తెచ్చుకున్న నటుడు మోహన్ బాబు. పెద్ధరాయుడు, అల్లుడుగారు, అసెంబ్లీ రౌడీ, మేజర్ చంద్రకాంత్, దేవత తదితర హిట్ సినిమాలలో మోహన్ బాబు నటించారు. నటనలోనూ, డైలాగ్ డెలివరీలోనూ ఒక ఒరవడి క్రియేట్ చేశాడు కనకనే పరిశ్రమకొచ్చి 40 ఏళ్లు దాటినా ఇంకా మెరుపులు మెరిపిస్తున్నాడు మోహన్ బాబు.

 సినీ నటుడిగా, నిర్మాతగా, రాజకీయవేత్తగా మోహన్ బాబు తనదైన ముద్ర వేశారు. సుమారు 560 చిత్రాల్లో నటించిన ఆయన, టీడీపీ తరపున  రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 2007లో ‘పద్మశ్రీ’ పురస్కారంతో మోహన్ బాబును భారత ప్రభుత్వం గౌరవించింది.

ఓ వైపు సినిమా మరోవైపు శాంతినికేతన్ విద్యాసంస్థలతో సమాజసేవ చేస్తున్న డైలాగ్ కింగ్   కు మరిన్ని విజయాలు చేకూరాలని ఆశిస్తూ  మోహన్ బాబుకు మరోసారి గ్రేట్‌తెలంగాణ.కామ్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతోంది.

- Advertisement -