ఐపీఎల్‌ 2020:ఆశలు వదిలేసిన ఆసీస్ క్రికెటర్లు

335
ipl austraila players
- Advertisement -

ఐపీఎల్‌ 2020పై నీలినీడలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో ఏప్రిల్ 15 వరకు ఐపీఎల్‌ని వాయిదా వేసిన టోర్ని జరిగేది సందిగ్దంగానే మారింది.ఎందుకంటే ప్రస్తుతం ఉన్న వీసా నిబంధనల ప్రకారం విదేశీ క్రికెటర్లు భారత్‌లో అడుగుపెట్టే అవకాశం లేకపోవడంతో టోర్నీని ఇంకాస్త వెనక్కి జరిపే సూచనలు కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఐపీఎల్ సీజన్‌ 13పై ఆశలు వదులుకున్నారు ఆసీస్ క్రికెటర్లు. తమ అనుమతి లేకుండా విదేశీ పర్యటనకి ఎవరూ వెళ్లకూడదని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిషన్ ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా నిబంధనల్ని అతిక్రమించి విదేశీ పర్యటనకి వెళ్తే..? వారి ట్రావెల్ ఇన్సూరెన్స్‌ని రద్దు చేయడంతో పాటు.. వారికి ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి సాయం లభించబోదని స్పష్టం చేశాడు.

దీంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం నిబంధనల్ని సడలించే వరకూ వీరు దేశం వీడే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో మొత్తంగా ఐపీఎల్‌కి ఆస్ట్రేలియా క్రికెటర్లు దూరంగా ఉండనున్నట్లు స్పష్టమవుతోంది.

- Advertisement -