పాగల్‌ అయిన విశ్వక్‌సేన్..!

446
paagal
- Advertisement -

ఫలక్‌నుమాదాస్‌తో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో విశ్వక్ సేన్. హిట్ సినిమాతో పర్వాలేదనిపించిన విశ్వక్‌ తాజాగా పాగల్‌గా మారాడు. అదే తన నెక్ట్స్‌ మూవీ పాగల్‌తో ప్రేక్షకుల ముందుకురానున్నాడు.

నూత‌న ద‌ర్శ‌కుడు న‌రేష్ కొప్పల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాలు ఇవాళ జరిగాయి. ఈ సందర్భంగా టైటిల్‌ లోగో విడుదల చేయగా ఇందులో విశ్వక్ సేన్‌ లుక్ ఆకట్టుకునేలా ఉంది.

హిట్ మూవీకి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గా అద్భుతమైన విజువల్స్ అందించిన మణికందన్ మరొకసారి ఈ సినిమాకు పని చేస్తూ ఉండగా గ్యారీ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఇక అర్జున్ రెడ్డి సినిమాకు మ్యూజిక్ అందించిన రధాన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. హీరోయిన్ గా కొత్త అమ్మాయికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. మొత్తంగా పాగల్ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు విశ్వక్‌.

- Advertisement -