ఎన్టీఆర్, చంద్రబాబు ఇద్దరూ మనధైర్యమని తెలిపారు నారా లోకేశ్. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ట్విట్టర్లో ట్వీట్ చేసిన లోకేశ్…కార్యకర్తలు మన బలం, పసుపు జెండా మన పవర్ అని తెలిపారు. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది ఎన్టీఆర్. అభివృద్ధిని పరిచయం చేసింది చంద్రబాబు అని ప్రశంసించారు.40 వసంతాల పసుపు పండుగ జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.
ప్రజల కోసమే 40 ఏండ్ల క్రితం ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ ప్రజల జీవితాల్లో మార్పులు ని తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు. పార్టీ ఆవిర్భావం కంటే ముందు కొందరికే పరిమితమైన అధికారాన్ని టీడీపీ అన్ని వర్గాలకు పంచిందని గుర్తు చేశారు.
టీడీపీ అంటేనే అభివృద్ధి..సంక్షేమం.. సంస్కరణలను గ్రామ స్థాయికి అందించిన ఘనత టీడీపీదని అన్నారు. పార్టీ చారిత్రక ప్రాధాన్యాన్ని గుర్తుకుతెచ్చేలా వేడుకలు నిర్వహించాలని శ్రేణులకు పిలుపు నిచ్చారు. పార్టీ ఆవిర్భావానికి ఆద్యుడు, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన దివంగత ఎన్టీఆర్ మార్గదర్శకుడని వెల్లడించారు.