- Advertisement -
ఉక్రెయిన్ – రష్యా మధ్య యుద్దమేఘాలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. ఏ క్షణమైనా ఉక్రెయిన్‌పై దాడి చేసేందుకు రష్యా సిద్ధం కాగా తాజాగా జాతినుద్దేశించి ప్రసంగించిన ఆ దేశ అధ్యక్షుడు పుతిన్..ఉక్రెయిన్ తిరుగుబాటు ప్రాంతాలైనా డోనెట్క్స్,లూహాన్స్క్ ప్రాంతాలను స్వతంత్ర రాజ్యాలుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు.
దీంతో ఆ ప్రాంతాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇక రష్యా తీరుపై ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సార్వభౌమత్వం విషయంలో రష్యా ఎలా జోక్యంచేసుకుంటుందని ప్రశ్నించారు. మరోవైపు రష్యాను చర్చలకు ఒప్పించేందుకు అమెరికా సర్వ ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో పుతిన్ తీసుకున్న నిర్ణయంతో అగ్రరాజ్యానికి ఆగ్రహం తెప్పించింది. ఉక్రెయిన్‌పైదాడి ఆలోచన విరమించుకోకుంటే, గట్టి ఎదురుదెబ్బ తప్పదని హెచ్చరించింది.
- Advertisement -