23న భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్..!

169
kalyan
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవన్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం భీమ్లానాయక్. ఈ నెల 25న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సినిమా ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్‌ అయింది. ఈ నెల 23న హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని, కేటీఆర్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

ఇక ఇప్పటికే విడుదల చేసిన సినిమా ట్రైలర్‌ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది. టాలీవుడ్‌లో అతివేగంగా 7 మిలియన్ వ్యూస్ సాధించిన ట్రైలర్‌గా భీమ్లానాయక్ ట్రైలర్ రికార్డు సృష్టించింది.

- Advertisement -