లైగర్ ఓటీటీ రేటెంతో తెలుసా..?

97
vijay
- Advertisement -

ప్యాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రాబోతోన్న ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ లైగర్ (సాలా క్రాస్ బ్రీడ్) సినిమా షూటింగ్ పూర్తికావొస్తుంది. బిగ్గెస్ట్ యాక్షన్ చిత్రంగా లైగర్ నిలవబోతోంది. ఇందులో లెజెండ్ మైక్ టైసన్ ముఖ్య పాత్రను పోషించారు. రియల్ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరపై చూసేందుకు సినీ ప్రేమికులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

లైగ‌ర్ పోస్ట్ థియాట్రిక‌ల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫాం (Disney+ Hotstar) భారీ మొత్తానికి ద‌క్కించుకుంద‌ట‌. తాజా స‌మాచారం ప్ర‌కారం లైగ‌ర్ ఓటీటీ డీల్ రూ.65 కోట్ల‌కు కుదిరింద‌ని ఇన్ సైడ్ టాక్‌. సౌతిండియా సినిమా ఓటీటీ అతి పెద్ద ఒప్పందాల్లో ఇది.

ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు. థాయిలాండ్ స్టంట్ డైరెక్టర్ కెచ్చా యాక్షన్ సీక్వెన్స్‌లను కంపోజ్ చేస్తున్నారు. విష్ణు శర్మ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో రూపొందిస్తున్నారు. ఆగస్ట్ 25న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకానుంది.

- Advertisement -