నేను మోసం చేసింది వారినే: పూరి

256
puri
- Advertisement -

లైగర్ సినిమా ఫ్లాప్‌తో చిక్కుల్లో పడ్డారు దర్శఖుడు పూరి జగన్నాథ్. పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్‌గా మిగిలింది. దీంతో డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయారు. ఈ క్రమంలో కొంత డబ్బులు వెనక్కి ఇచ్చేందుకు పూరి నిర్ణయం తీసుకోగా కొంతమంది పూరి ఆఫీస్‌ ముందు ధర్నాకు దిగేందుకు ప్రయత్నించారు. ఇక ధర్నాకు దిగేవారిని ఉద్దేశించి పూరి చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్లపై జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

ఇక తాజాగా మరోసారి ఈ వివాదంపై స్పందించారు పూరి. ఈ మేరకు లేఖ విడుదల చేసిన ఆయన..తాను ఎవడినైనా మోసం చేసానంటే, అది నన్ను నమ్మి నా సినిమా టికెట్ కొన్న ప్రేక్షకుడిని మాత్రమే అని తెలిపారు. గుండెల నిండా ఊపిరి పిలిస్తే బతుకుతామని అనుకుంటాం. కానీ వెంటనే చెయ్యాల్సిన పని ఏంటి? ఊపిరి ఒదిలెయ్యటమే. గెలుపోటములు కూడా అంతే, ఒకటి వస్తే ఇంకోటి పోక తప్పదు. పడతాం-లేస్తాం, ఏడుస్తాం-నవ్వుతాం, ఎన్నో రోజులు ఏడ్చిన తరువాత జరిగేది ఏంటి ? పగలబడి నవ్వటమే. ఇక్కడ ఏదీ శాశ్వతం కాదని లేఖలో పేర్కొన్నారు.

నడిచా, మెట్లు ఎక్కా, పడిపోయా, కాలుజారింది, నదిలో పడ్డా, కొట్టుకుపోయా, వడ్డుకు చేరా, ఇంట్లో తిట్టారు, ఊరు వేలేసింది, ఉరేసుకోవాలనిపించింది, ఎవడో కాపాడాడు, వాడు నేను కౌగిలించుకున్నాం, వాడే మోసం చేసాడు, ఇలా ఎన్నెన్నో లైఫ్ లో జరుగుతుంటాయి. అవన్నీ సన్నివేశాలు మాత్రమే. అందుకే లైఫ్ ని సినిమాలా చూస్తే, షో అయిపోగానే మర్చిపోవచ్చు అన్నారు.

లైఫ్ లో నువ్వు హీరో ఐతే, సినిమాలో హీరోకి ఎన్ని జరిగాయో అవన్నీ నీకు కూడా జరుగుతాయి. ఒకవేళ అవి జరగకపోతే మీరు హీరో కాదేమో అనుకొనే ప్రమాదం ఉంది. అందుకే మనం హీరోలా బతకాలి. బతకాలి అంటే నిజాయితీగా ఉండాలి. నిజాన్ని కాపాడాల్సిన అవసరం లేదు. నిజాన్ని నిజమే కాపాడుకుంటుంది. ఇక డబ్బు అంటారా? చచ్చినాక ఇక్కడనుండి ఒక్క రూపాయి తీసుకెళ్లిన ఒక్కడి పేరు నాకు చెప్పండి, నేనూ దాచుకుంటా. ఫైనల్ గా అందరం కలిసేది స్మశానంలోనే. మధ్యలో జరిగేది అంతా డ్రామా అంటూ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి..

జోడో జోష్‌…పాదయాత్రలో పరుగులు

చండూరులో సీఎం కేసీఆర్ సభ..

సంక్రాంతి రేస్‌..సినిమాలు ఫిక్స్‌!

- Advertisement -