పీఆర్సీ పై ఉద్యోగుల సమ్మెకు జనసేన మద్దతు..

115
- Advertisement -

వైసిపి అధికారుంలోకి రావడానికి ప్రత్యక్షంగాను పరోక్షంగా సహాయపడిన ఉద్యోగులను పీఆర్సీ పేరుతో దగా చేసిన ఘనత జగన్ కే దక్కుతుందని జనసేన పీఏసీ సభ్యుడు పంతం నానాజీ అన్నారు..ఈరోజు కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫే రిలీఫ్ 27 శాతం నుండి 23 శాతానికి తగ్గించిన ఘనత ఈ ప్రభుత్వానిది ఉద్యోగులు చనిపోయిన తరువాత ఇచ్చే మట్టి ఖర్చులను కూడా ఆదా చేసుకునే దౌర్భాగ్య స్ధితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదనప్పుడు మీకు ఇంతమంది సలహాదారులు ఎందుకు.. సలహాదారులు పేరుతో మీరు చేస్తున్నది వృధా ఖర్చు కాదా? అని ప్రశ్నించారు.

అధికారం లోకి వచ్చిన రెండున్నరేళ్ల కాలంలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన వర్గాలను దూరం చేసుకున్న ఘనత జగన్ కే దక్కుతుంది. మద్య విమోచన సలహాదారులు ఇప్పటి వరకు మద్యనిషేధానికి చేసిన కృషి ఏమిటి అని నిలదీశారు.. పీఆర్సీ పై ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి జనసేన పార్టీ మద్దతు ఇస్తుంది. ఉద్యోగులతో కలిసి ఉమ్మడి కార్యాచరణపై ఆలోచన చేస్తున్నాం అని తెలిపారు. ఉద్యోగుల డిమాండ్స్‌లో రిటైర్మెంట్ వయసు పెంచమని ప్రభుత్వాన్ని ఎప్పుడైనా అడిగార.. ఉద్యోగులకు ఇచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేక రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలకు పెంచారు.ఈ నిర్ణయం వలన నిరుద్యోగ యువతకు అన్యాయం చేసినట్లు కాదా అని ప్రశ్నించారు.

- Advertisement -