ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ జీవోలపై సచివాలయ ఉద్యోగుల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సచివాలయంలో రెండు గంటల పాటు సచివాలయ ఉద్యోగుల సంఘం సమావేశమైంది. పీఆర్సీ జీవోలు జారీ చేసిన విధానంపై చర్చించారు. ఫిట్మెంట్, హెచ్చార్ఏలను భారీగా తగ్గించడంపై ఉద్యోగుల అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో నిరసన బాట పట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రేపటి నుంచి వివిధ రూపాల్లో ఆందోళన చేయాలని సచివాలయ ఉద్యోగులు నిర్ణయించుకున్నారు.
ఈరోజు సచివాలయం ఫస్ట్ బ్లాకులో సీఎస్ సమీర్ శర్మను కలిసేందుకు సెక్రటేరీయేట్ ఉద్యోగులు ర్యాలీగా వెళ్లారు. వారిలో కొందరిని మాత్రమే ఫస్ట్ బ్లాక్ వద్దకు అనుమతించింది భద్రతా సిబ్బంది. రేపటి నుంచి తాము ఆందోళన చేపట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని సీఎస్ శర్మకు వివరిస్తామంటున్న ఉద్యోగులు తెలిపారు. పీఆర్సీ జీవోలను రోల్ బ్యాక్ చేయాలని సెక్రటేరీయేట్ ఉద్యోగుల డిమాండ్ చేశారు. అయితే సీఎస్ అందుబాటులో లేకపోవడంతో పేషీలో రిప్రజేంటేషన్ ఇచ్చారు సెక్రటేరీయేట్ ఉద్యోగులు.