ఎమ్మెల్సీ కసిరెడ్డికి బర్త్‌డే విషెస్‌ తెలిపిన సీఎం కేసీఆర్..

56
- Advertisement -

ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజాసేవ చేయాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. కల్వకుర్తి నియోజకవర్గం లోని తలకొండపల్లి మాడుగుల కడ్తాల్ ఆమన్గల్ వెల్దండ కల్వకుర్తి మండలల్లో ఎమ్మెల్సీ కసిరెడ్డి జన్మదిన వేడుకలు నాయకులు,కార్యకర్తలు అభిమానులు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి,అభిమానులు ఏర్పాటు చేసిన కేకులు కట్ చేసి మొక్కలు నాటారు.పలువురు నేతలు కార్యకర్తలు అభిమానులు ఎమ్మెల్సీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు.

- Advertisement -