దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు..

126
omicron cases
- Advertisement -

దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య వెయ్యికి చేరాయి. గత 24 గంటల్లో 180 మంది ఒమిక్రాన్ బారిన పడగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 962కి చేరాయి. ఢిల్లీలో 263,మహారాష్ట్రలో 252,గుజరాత్‌లో 97,రాజస్థాన్‌లో 69,కేరళలో 65,తెలంగాణలో 62 కేసులు నమోదయ్యాయి.

దేశంలో పెరుగుతున్న కేసులు వల్ల ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఒమిక్రాన్, డెల్టా వేరియంట్లు కలిసి పెద్ద ఎత్తున సునామీ లాగా కేసుల సంఖ్య నమోదయ్యే అవకాశం ఉందంటూ హెచ్చరించింది డబ్ల్యూహెచ్‌వో. 70 శాతం జనాభా తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.

- Advertisement -