ఒమిక్రాన్ విధ్వంసం.. 7 రోజుల్లో 2.5లక్షల కేసులు

119
omicron

అగ్రరాజ్యం అమెరికాలో ఒమిక్రాన్ వేరియంట్ విధ్వంసం సృష్టిస్తోంది. గత ఏడు రోజుల్లో అమెరికాలో 2లక్షల 58వేల 312 ఒమిక్రాన్ కేసులు నమోదుకావడంతో అందరిని భయాందోళనకు గురిచేస్తోంది. యూఎస్‌లో రోజుకు సగటున 2,65,000 కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి.

కరోనా ఇన్‌ఫెక్షన్ల సంఖ్య పెరగడంతో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను రద్దు చేసింది ప్రభుత్వం. అమెరికాలో గత రెండు వారాల్లో, కోవిడ్-19 మరణాల సంఖ్య కూడా రోజుకు సగటున 1200 నుండి 1500కి పెరిగాయి.