నిర్మల్‌కే తలమానికంగా మహాలక్ష్మీ ఆలయం:ఐకే రెడ్డి

61
ik reddy
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని అన్ని ఆలయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని హంగులతో అభివృద్ధి చేయడం జరుగుతుందని దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్ పేట్ మహాలక్ష్మి అమ్మవారి నూతన ఆలయ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆలయాన్ని రెండు కోట్ల 60 లక్షల రూపాయలతో చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆలయ నిర్మాణానికి కోటి అరవై లక్షల రూపాయలను కేవలం ప్రత్యేకమైన రాయి కోసం వినియోగిస్తున్నామన్నారు. అదేవిధంగా దసరా వేడుకలను ఇక్కడ అ ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కేంద్రం అయిన తర్వాత భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో నూతన ఆలయాన్ని నిర్మించడం జరుగుతుందని తెలిపారు. ఆలయ పరిసరాల్లో హరితహారం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ చెట్లను నాటి వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని కోరారు. గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం లాగే మహాలక్ష్మి ఆలయం సైతం నిర్మల్ కు తలమానికంగా నిలుస్తుందని ఆయన తెలిపారు.

- Advertisement -