బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ 5 తెలుగు 76 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 76వ ఎపిసోడ్‌లో భాగంగా రింగ్ ఈజ్ కింగ్ అనే కెప్టెన్సీ టాస్క్‌లో మానస్ గెలిచి పదకొండో వారంలో ఇంటి కెప్టెన్‌గా మారాడు. కెప్టెన్ అయిన తరువాత మానస్.. సన్నీ, కాజల్ దగ్గరకు వచ్చాడు. ఏ డిపార్ట్మెంట్ కావాలి, ఏ పని చేస్తావ్ అని కాజల్‌ను, మానస్‌ని అడిగాడు. ఏది ఇస్తే అది చేస్తాను అని కాజల్ తెలపగా సన్నీ అయితే ఏకంగా మానస్‌కు ముద్దులు పెట్టేశాడు.
తర్వాత ఎవిక్షన్ ఫ్రీ పాస్ గురించి టాస్క్ మొదలైంది. ఎలిమినేషన్‌ను తప్పించుకునేందుకు ఓ అవకాశాన్ని ఇచ్చాడు. దీని కోసం గార్డెన్ ఏరియాలో పెద్ద సెటప్ వేశాడు. ఫైర్ ఇంజన్, ఇళ్లు కాలిపోవడం అంటూ టాస్క్‌ను వివరించారు. సమయానుసారంగా సైరన్లు మోగుతాయి. ఆ సమయంలో ఫైర్ ఇంజన్‌లోకి ఎక్కిన ఇద్దరూ ఏకాభిప్రాయంతో ఒకరిని కాపాడాల్సి ఉంటుంది. ఏకాభిప్రాయం రాకపోతే.. ఇద్దరి ఫోటోలు కాలిపోతాయని తెలిపాడు. చివరి వరకు ఎవరి ఫోటో అయితే కాలిపోకుండా ఉంటుందే వారికే ఎవిక్షన్ ఫ్రీ పాస్ సొంతమవుతుందని తెలిపాడు.
మొదటి సైరెన్‌కు రవి, సన్నీలు ఫైర్ ఇంజన్‌లోకి ఎక్కి శ్రీరామచంద్రను సేఫ్ చేసి.. మానస్ ఫోటోను కాల్చేశారు. ఆ తరువాత మానస్, సన్నీలు ఎక్కారు. వారిద్దరు కలిసి ఆనీ మాస్టర్, రవిలోంచి.. ఆనీ మాస్టర్‌ను సేఫ్ చేశారు. తర్వాత సిరి, షన్ను ఫైర్ ఇంజన్‌లోకి ఎక్కి సన్నీ, ప్రియాంకలోంచి.. సన్నీని కాపాడారు. ఆనీ, శ్రీరామ ఫైర్ ఇంజన్ ఎక్కేసి..సిరి, షన్నులోంచి సిరిని సేఫ్ చేశారు. కాజల్, ప్రియాంక కలిసి సిరిని సేఫ్ చేశారు. చివరకు సన్నీ మిగిలిపోవడంతో సన్నీకి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చింది.