- Advertisement -
గద్దలకొండ గణేశ్ తర్వాత కాసింత గ్యాప్ తీసుకున్న దర్శకుడు హరీష్ శంకర్ తాజాగా తన నెక్ట్స్ సినిమా అనౌన్స్‌చేశారు. అయితే ఈ సారి మెగాఫోన్ పట్టకుండా కథను అందిస్తున్నారు. ఈ సినిమాకు అలనాటి నటుడు వేదాంతం రాఘవయ్య పేరు ఖరారు చేయగా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది.
తొలుత ఈ సినిమాలో సునీల్ హీరోగా నటిస్తారని ప్రకటించగా 14రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ అచంట,గోపి అచంట నిర్మిస్తున్నారు. హరీశ్ శంకర్ వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన చంద్రమోహన్ దర్శకత్వంలో వహిస్తుండగా సునీల్ బదులు సత్యదేవ్ హీరోగా నటిస్తున్నట్టు తెలుస్తోంది.
విలక్షణ పాత్రలతో వైవిధ్యమైన కథలతో సినిమాలు చేసే సత్యదేవ్.. ఇందులో టైటిల్ రోల్ పోషించనుండడం ఆసక్తిగా మారింది. సునీల్ ఈ ప్రాజెక్ట్ నుంచి ఎందుకు తప్పుకున్నారో తెలియదు కానీ సినిమాకు సంబంధించి రోజుకో వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.
- Advertisement -