జీ మ్యూజిక్ చేతిలో మేజర్

109
major
- Advertisement -

అడివి శేష్ హీరోగా రాబోతోన్న మేజర్ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. దీపావళికి ముందు రోజు ఇలా అప్డేట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు మేక‌ర్స్‌. ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేస్తూ.. రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మూడు భాషల్లో హిందీ, తెలుగు, మళయాల భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ క్రమంలోనే అన్ని భాషలకు సంబంధించిన వరల్డ్ వైడ్ మ్యూజిక్ రైట్స్‌ను ‘జీ మ్యూజిక్’ కంపెనీ వారు దక్కించుకున్నట్లు తాజాగా మేకర్స్ వెల్లడించారు. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరెక్కిస్తున్నారు. 26/11 దాడుల్లో ఆయన చూపించిన తెగువ, ధైర్య సాహసాలు మాత్రమే కాకుండా ఆయన జీవితంలోని ప్రతీ ఒక్క ఘటనను చూపించబోతోన్నారు. ఆయన ఏ స్ఫూర్తితో జీవించారు.. ఎలా మరణించారు అనేవి అందరినీ కట్టిపడేసేలా చూపించనున్నారు.

- Advertisement -