సునీల్ కి మరో తమిళ్ ఆఫర్

43
- Advertisement -

నటుడు సునీల్ తన కెరీర్‌ను హాస్యనటుడిగా ప్రారంభించాడు. కమెడియన్ గా బాగా విజయం సాధించాడు. తరువాత హీరోగా మారాడు. హీరోగా చేసిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగానే వర్కవుట్ అయ్యాయి. ఇప్పుడు సునీల్ క్యారెక్టర్ రోల్స్ చేయడం ప్రారంభించాడు. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సునీల్ విలన్ గా మరింత బిజీ చేసేసింది.

సుకుమార్ పుష్ప లో సునీల్ ను భయపెట్టే విధంగా ప్రెజెంట్ చేసి లుక్ మార్చేశాడు. దీంతో ఇప్పుడు తమిళంలో భారీ ఆఫర్లు అందుకుంటున్నాడు. సునీల్ ఇప్పటికే శివ కార్తికేయన్ మావీరన్ మరియు కార్తీ జపాన్‌లో భాగమయ్యాడు. రజనీ జైలర్‌లో కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిసిందే.

తాజాగా విశాల్ మార్క్ ఆంథోని కోసం సునీల్ ను ఒక నెగటివ్ రోల్ కి తీసుకున్నారు. పోస్టర్‌ తో ప్రొడక్షన్ టీం అఫిషియల్ గా ఎనౌన్స్ చేశారు. ఆదిక్ రవిచంద్రన్ రచన , దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో ఎస్ జె సూర్య కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -