ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 12న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో టీఆర్ఎస్ ధర్నాలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు కేటీఆర్.
స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ధర్నాల కోసం కలెక్టర్ల నుండి అనుమతి తీసుకోవాలన్నారు. కలెక్టర్ల అనుమతితోనే ధర్నాలు నిర్వహించాలని తెలిపారు. ఇక హైదరాబాద్‌లో ఇందిరాపార్క్ వద్ద భారీ ధర్నాను నిర్వహించనుంది టీఆర్ఎస్.
హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద టిఆర్ఎస్ పార్టీ ఈ నెల12న చెప్పట్టే ధర్నా ఏర్పాట్లు పరిశీలించారు మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, డిప్యూటీ మేయర్ శ్రీలత. రాష్ట్ర బీజేపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు…కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే వరకు నిరంతర పోరాటం చేస్తాం అన్నారు తలసాని.