టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్–1లో సెమీస్‌కు చేరే జట్లలో ఇంగ్లాండ్ ఖరారైంది. వరుసగా రెండో విజయంతో సెమీఫైనల్ దిశగా మరో అడుగు వేసింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఎనిమిది వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై జయభేరి మోగించింది. బంగ్లా విధించిన లక్ష్యాన్ని ఇంగ్లండ్ 14.1 ఓవర్లలోనే రెండే వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసి గెలిచింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ జేసన్ రాయ్ (38 బంతుల్లో 61; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరిపించాడు.
మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్ చేసిన 29 పరుగులు చేశారు. ఓపెనర్లు లిటన్ దాస్ (9), నైమ్ (5)లను అలీ వరుస బంతుల్లోనే పెవిలియన్ చేర్చగా, షకీబ్ (4)ను వోక్స్ ఔట్ చేశాడు. దీంతో ‘పవర్ ప్లే’లో బంగ్లా మూడు టాపార్డర్ వికెట్లను కోల్పోయింది. టైమల్ మిల్స్ మూడు, మొయిన్ అలీ, లివింగ్‌స్టోన్ చెరో రెండు వికెట్లు తీశారు.