బంగ్లాదేశ్‌పై విండీస్ విజయం..

122
- Advertisement -

షార్జా వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో వెస్టిండీస్ విజయం సాధించింది. శుక్రవారం వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌ జరిగింది. ఈ పోరులో చివరి బంతికి ఫోర్ కొడితే గెలుస్తారనగా, బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా బలంగా బ్యాట్ ఊపినా బంతికి తగల్లేదు. దాంతో వెస్టిండీస్ అనూహ్యరీతిలో విజేతగా నిలిచింది.

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులు చేయగా.. లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 139 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ లో లిటన్ దాస్ 44 పరుగులు చేయగా, కెప్టెన్ మహ్మదుల్లా 31 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు. విండీస్ బౌలర్లలో రాంపాల్, హోల్డర్, రస్సెల్, హోసీన్, బ్రావో తలో వికెట్ తీశారు. సూపర్-12 దశలో గ్రూప్-1లో 3 మ్యాచ్ లు ఆడిన విండీస్ కు ఇదే తొలి విజయం. ఈ మ్యాచ్ లో ఓడిపోయుంటే విండీస్ నాకౌట్ ఆశలు గల్లంతయ్యేవి.

- Advertisement -