సామాన్యుడిపై చమురు కంపెనీలు భారం మోపుతూనే ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజూ పెరిగాయి. ఇప్పటికే నూనెలు, వంటగ్యాస్ సహా ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో చమురు ధరల పెంపు నుంచి కనీసం పండగరోజైనా ఉపశమనం లభిస్తుందని ఆశించిన సామాన్యులకు నిరాశే మిగిలింది.
తాజాగా ఆదివారం లీటర్ పెట్రోల్ మీద 37 పైసలు, డీజిల్ పై 38 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.110 దాటేసింది. ఏపీలోని విజయవాడ, గుంటూరుల్లో రూ.112.38గా ఉంది. అన్ని రాష్ట్రాల రాజధానుల్లోనూ లీటర్ పెట్రోల్ ధర సెంచరీ మార్కును క్రాస్ చేసేసింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.77గా ఉండగా.. ఢిల్లీలో రూ.105.84గా ఉంది.
ప్రధాన నగరాల్లో లీటర్ ధరలు ఇలా ఉన్నాయి..
-హైదరాబాద్: పెట్రోల్ – రూ.110.09, డీజిల్ – రూ.103.18
-విజయవాడ: పెట్రోల్ – రూ.112.38, డీజిల్ – రూ.104.83
-గుంటూరు: పెట్రోల్ – రూ.112.38, డీజిల్ – రూ.104.83
-విశాఖపట్నం: పెట్రోల్ – రూ.110.90, డీజిల్ – రూ.103.43
-ఢిల్లీ: పెట్రోల్ – రూ.105.84, డీజిల్ – రూ.94.57
-ముంబై: పెట్రోల్ – రూ.111.77, డీజిల్ – రూ.102.52
-చెన్నై: పెట్రోల్ – రూ.103.01, డీజిల్ – రూ.98.92
-బెంగళూరు: పెట్రోల్ – రూ.109.53, డీజిల్ – రూ.100.37