‘సర్కారు వారి పాట’ నుండి కీర్తి సురేష్ బర్త్ డే పోస్టర్..

222
- Advertisement -

ఆదివారం హీరోయిన్ కీర్తి సురేష్‌ పుట్టినరోజు జరుపుకుంటుంది. కీర్తి ప్రస్తుతం హీరోయిన్‌గా ‘సర్కారు వారి పాట’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రబృందం ప్రత్యేకంగా ఆమె పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. కీర్తి సురేష్ నటిస్తున్న క్రేజీ మూవీస్‌లో ‘సర్కారు వారి పాట’ ఒకటి. పరశురామ్ పెట్లా దర్శకత్వం వహిస్తున్న ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో. జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్..14 రీల్ ప్లస్.. మైత్రీ మూవీ మేకర్స్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కాగా చిత్ర హీరోయిన్ కీర్తి సురేష్ బర్త్ డే సందర్భంగా, ఆమెకు విషెస్ తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. హీరో మహేష్‌ బాబు, దర్శకుడు పరశురామ్ సహా మిగతా యూనిట్ సభ్యులు కీర్తికి స్పెషల్‌గా విషెస్ తెలిపారు. ఇక ‘సర్కారు వారి పాట’ మూవీతో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘అణ్ణాత’, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’, నేచురల్ స్టార్ నాని ప్రకటించిన కొత్త సినిమా ‘దసరా’లోనూ కీర్తి సురేష్ నటిస్తోంది.

- Advertisement -