నేడు భారత్‌ బంద్‌..

143
Bharat Bandh
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) ఆధ్వర్యంలో 500కు పైగా రైతు, ప్రజాసంఘాలు సోమవారం భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు భారత్‌ బంద్‌కు మద్దతు ప్రకటించాయి. సోమవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్‌ జరగనుంది.

ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ,ప్రైవేటు కార్యాలయాలు,విద్యాసంస్థలు,దుకాణాలు,పరిశ్రమలు,వ్యాపార,వాణిజ్య సంస్థలు మూతపడనున్నాయి. ఆస్పత్రులు,మెడికల్‌ షాపులు,ఇతర అత్యవసర సేవలను బంద్‌ నుంచి మినహాయిస్తున్నట్టు ఎస్‌కేఎం ప్రకటించింది.ప్రజలందరూ స్వచ్ఛందంగా,శాంతియుతంగా బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చింది.

- Advertisement -