దిల్ రాజుతో ‘విజయ్‌ 66’..

132
- Advertisement -

టాలీవుడ్‌ టాప్‌ ప్రొడ్యూసర్‌ దిల్ రాజు, తమిళ హీరో విజయ్‌తో క్రేజీ ప్రాజెక్టుకు తెరలేపారు. విజయ్ హీరోగా నటించే ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా విజయ్ కెరీర్ లో 66వ చిత్రం. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. హీరో విజయ్, దిల్ రాజు, వంశీ పైడిపల్లి కలిసున్న ఫొటోను కూడా పంచుకుంది. ఈ మేరకు ఆదివారం ఈ సినిమా సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేశారు.

ఈ చిత్రం ద్వారా దిల్‌రాజు తమిళ చిత్రసీమలో నిర్మాతగా అరంగేట్రం చేయబోతున్నారు. ‘విజయ్‌ నటిస్తున్న 66వ చిత్రమిది. భారీ స్థాయిలో తెరకెక్కించబోతున్నాం. మరిన్ని వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం’ అని నిర్మాణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం నెల్సన్‌ దర్శకత్వంలో విజయ్‌ ‘బీస్ట్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఇది పూర్తవగానే దిల్‌రాజు నిర్మించబోయే ఈ సినిమాను పట్టాలెక్కించబోతున్నారు.

- Advertisement -