దేశంలో కొత్తగా 28,326 క‌రోనా కేసులు నమోదు..

96
corona
- Advertisement -

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య రోజు రోజుకు తగ్గుముఖం పడుతుంది. గత 24 గంటల్లో 28,326గా న‌మోద‌యింద‌ని కేంద్ర‌, వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, క‌రోనా నుంచి నిన్న 26,032 మంది కోలుకున్నారు. నిన్న క‌రోనాతో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌లో 3,03,476 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా నుంచి 3,29,02,351 మంది కోలుకున్నారు. 4,46,918 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

కాగా, కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 16,671 కేసులు ఒక్క కేరళలోనే ఉన్నాయని తెలిపింది. రాష్ట్రంలో మరో 260 మంది కన్నుమూశారని తెలిపింది. 68,42,786 మందికి కరోనా వ్యాక్సినేషన్‌ చేశామని పేర్కొంది. దీంతో మొత్తంగా 85,60,81,527 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.

- Advertisement -