- Advertisement -
మెగా హీరో సాయి తేజ్ శుక్రవారం హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిపై తాను నడుపుతున్న స్పోర్ట్స్ బైక్ నుండి కిందపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో కిందపడిన తేజ్‌కు తీవ్రగాయాలు కాగా ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే ఆయన్ని మాదాపూర్‌లోని మెడికవర్ తర్వాత అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తేజ్‌కు యాక్టిడెంట్ వార్తతో కుటుంబ సభ్యులతో పాటు ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో స్పందించారు మెగాస్టార్ చిరంజీవి. తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు చిరు. తేజ్‌కు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని త్వరలోనే కోలుకుంటాడని తెలిపారు. ప్రమాద సమయంలో సాయి ధరమ్ తేజ్ ఎలాంటి మద్యం తాగలేదని… రోడ్డుపై ఇసుక ఉండడంతో అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యారని పేర్కొన్నారు.
- Advertisement -