తేజ్ త్వరగా కోలుకుంటారు: తలసాని

58
talasani

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గణనాథుడి ఆశిస్సులతో తేజ్ త్వరగా కోలుకుంటాడని …ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపినట్లు వెల్లడించారు. దేవుని దయతో తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

కాగా, సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్యపరిస్థితి నిలకడగానే ఉందని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, కాలర్‌ బోన్‌ ఫ్యాక్చర్‌ అయిందన్నారు. మరో 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని చెప్పారు.

తేజ్.. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పి కిందపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన ఆయన కంటి పైభాగం సహా ఛాతీ భాగంలో గాయలయ్యాయి.