వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌…సద్వినియోగం చేసుకోండి: సోమేశ్ కుమార్

122
cs somesh
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యాక్సినేషన్ డ్రైవ్‌ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు సీఎస్ సోమేశ్‌ కుమార్. గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని చంద్రాయణగుట్టలో గ‌ల‌ ఉప్పుగూడ, పరివార్ టౌన్‌షిప్‌లో కొవిడ్‌ వ్యాక్సినేషన్ సెంటర్‌ను సోమేశ్ కుమార్ బుధవారం సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని 100 శాతం వ్యాక్సినేటేడ్ నగరంగా తయారుచేయాలన్నారు. వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరును అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. డోర్ టు డోర్ సర్వేను పూర్తిచేసి వ్యాక్సిన్ వేయించుకోని వారిని గుర్తించిన‌ట్లు అధికారులు తెలిపారు. ప్రజా ప్రతినిధులు ప్రజలు వ్యాక్సిన్ వేయించుకునేలా చూడాల‌న్నారు.

ఇప్పటివరకు జీహెచ్ఎంసీ పరిధిలో 585 కాలనీలల్లో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయిందన్నారు. 47,104 మందికి మొదటి విడత, 7304 మందికి రెండవ విడత వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది… జీహెచ్ఎంసీ నుండి 4182 మంది సిబ్బందిని, వైద్యశాఖ నుండి 1,639 మంది సిబ్బందిని రంగంలోని దించడం జరిగిందన్నారు.

- Advertisement -