దేశం కోసం, ధర్మం కోసం,భారతమాత ఈ పదాలు వింటే గుర్తుకొచ్చేది బీజేపీ నేతలే. ఎందుకంటే పొద్దున లేవగానే వారి నోటి నుండి వచ్చే మాటలు ఇవే. దేశంలో కోసం ధర్మం కోసం ఎంతదూరమైన వెళ్తామని గప్పాలు కొట్టుకునే ఈ కాషాయ నేతలు నిజంగానే చాలాదూరం వెళ్లారు. ఓ వైపు దేశంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. దేశంలో ఏ మూలకు వెళ్లినా మహిళలకు భద్రత కరువవుతున్నది. ఎంతోమంది మహిళలు మానవ మృగాలా భారిన పడి ప్రాణాలు వదులుతున్నారు.
ఇది దేశంలో ప్రస్తుత పరిస్థితి. అయితే ఇప్పుడు మహిళలకు దేశంలోనే కాదు బీజేపీ పార్టీలోనూ రక్షణ లేకుండా పోయింది. తమిళనాడుకు చెందిన ఓ బీజేపీ నేత…పార్టీ సభ్యురాలితో అసభ్యకరంగా మాట్లాడటం, చాటింగ్ చేయడం బయటకు రావడంతో ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పార్టీ సభ్యురాలితో తమిళనాడు బీజేపీ ప్రధాన కార్యదర్శి కేటీ రాఘవన్ అసభ్యకర చాటింగ్ వీడియో యూట్యూబ్‌లో ప్రత్యక్షమైయ్యింది. యూట్యూబర్ మదన్ రవిచంద్రన్ తన యూట్యూబ్ ఛానల్(మదన్ డైరీ)లో దాదాపు 20 నిమిషాల నిడివిగల ఈ వీడియోను అప్‌లోడ్ చేశారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
దీంతో రాఘవన్ తన పదవికి రాజీనామా చేశారు. మహిళలతో అసభ్యంగా విడీయో కాల్ మాట్లాడిని రాఘవన్‌పై కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణీ రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేయగా వీడియో కాల్ అంశం ఇప్పుడు రాష్ట్ర బీజేపీలో పెద్ద దుమారం రేపుతోంది. బయటే కాదు, బీజేపీ వంటి జాతీయ పార్టీలో కూడా మహిళలకు రక్షణ లేదని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తంగా తమిళనాట పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టిసారించిన బీజేపీకి ఈ వీడియో చాటింగ్ వ్యవహారం అసలుకే ఎసరు తెచ్చింది.