ఫొటోగ్రఫర్ల శ్రమ వెలకట్టలేనిది- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

192
- Advertisement -

ఫొటోగ్రఫర్ల శ్రమ వెలకట్టలేనిది అన్నారు రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఆయన ఫొటోగ్రఫర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వరదలు, కరువులు, ఉద్యమాలు, పోరాటాలను సమాజానికి తెలపాలన్న తపనతో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఫోటోలు తీస్తుంటారన్నారు.

అదేవిధంగా అందమైన జ్ఞాపకాలు.. తియ్యటి అనుభూతులు.. మధుర ఘట్టాలు.. విషాద సన్నివేశాలు.. వెలకట్టలేని దృశ్యాలను ఫోటో పదిలంగా ఉంచుతుందని వంద మాటలతో చెప్పలేనిది ఒక్క ఫొటోతో చెప్పొచ్చని మంత్రి పేర్కొన్నారు. సన్నివేశాన్ని గుర్తుండిపోయేలా ఫోటోగ్రఫర్లు తీసిన ఫోటోలు భావితరాలకు మధురమైన స్మృతులుగా మిగిలిపోతున్నాయన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.

- Advertisement -