20న సంపూర్ణేష్‌ బాబు ‘బజార్ రౌడీ’ విడుదల..

101

టాలీవుడ్‌ కామెడీ హీరో సంపూర్ణేష్‌ బాబు తాజా చిత్రంగా ‘బజార్ రౌడీ’. ఈ సినిమా ఈనెల 20న విదుడలకు సిద్ధమైంది. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సంపూ మాట్లాడాడు. “ఇంతవరకూ నేను చేసిన సినిమాలు ఒక ఎత్తు .. ఈ సినిమా ఒకటీ ఒక ఎత్తు. నిర్మాత సందిరెడ్డి శ్రీనివాసరావు – దర్శకుడు వసంత నాగేశ్వరరావు కథను నమ్మేసి రంగంలోకి దిగారు. నా సినిమా నుంచి అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి.

‘కొబ్బరి మట్ట’ సినిమాలో నేను పెదరాయుడు గెటప్‌లో కనిపిస్తే విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ‘బజార్ రౌడీ’లో నేను కొంతసేపు ‘బొబ్బిలి పులి’ గెటప్‌లో కనిపిస్తాను. ఈ ఎపిసోడ్ హైలైట్‌గా నిలుస్తుందని అనుకుంటున్నాను. రేపు ఈ సినిమాను 300 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాము. ఈ సినిమాను మీరంతా తప్పకుండా ఆదరించి విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను” అని చెప్పుకొచ్చాడు.