మరో కోవిడ్ టీకాకు కేంద్రం అనుమతి..

127
COVID-19 vaccine
- Advertisement -

జాన్స‌న్ అండ్ జాన్స‌న్ కంపెనీ సింగిల్ డోసు కోవిడ్ టీకాకు కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. అత్య‌వ‌స‌ర వినియోగం కింద ఆ టీకాల‌ను ఇవ్వ‌వ‌చ్చు అని ఇవాళ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్సూక్ మాండ‌వీయ త‌న ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు. జాన్సన్​ అండ్​ జాన్సన్​ సింగిల్​ డోస్​ కొవిడ్​-19 వ్యాక్సిన్​ అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చామన్నారు. ప్రస్తుతం దేశంలో 5 వ్యాక్సిన్​లు అందుబాటులోకి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. కొవిడ్​ మహమ్మారిపై దేశ పోరాటాన్ని మరింత ముందుకు వెళ్లనున్నట్లు మాన్సుఖ్​ మాండివియా తెలిపారు.

కాగా, ఆగ‌స్టు 5వ తేదీన సింగిల్ డోసు అప్రూవ‌ల్ కోసం జాన్స‌న్ కంపెనీ భార‌త ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ది. హైద‌రాబాద్‌కు చెందిన బ‌యోలాజిక‌ల్ ఈ సంస్థ‌తో జాన్స‌న్ కంపెనీ ఈ టీకాను ఉత్ప‌త్తి చేయ‌నున్న‌ది. సింగిల్ షాట్ వ్యాక్సిన్‌తో కరోనా వైర‌స్‌ను 85 శాతం స‌మ‌ర్థ‌వంతంగా నిర్మూలించే అవ‌కాశాలు ఉన్నాయి. మూడ‌వ ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌తో జాన్స‌న్ టీకా సామ‌ర్థ్యం తేలింది. వ్యాక్సిన్ తీసుకున్న 28 రోజుల త‌ర్వాత ఆ టీకా ప్ర‌భావం అధికంగా ఉన్న‌ట్లు గుర్తించారు.

- Advertisement -