‘మా’ అధ్యక్షుడు నరేష్‌పై నటి హేమ సంచలన వ్యాఖ్య‌లు..

134
Actress Hema
- Advertisement -

గత కొన్ని రోజుల నుండి తెలుగు సినీ పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు సంచలనంగా మారాయి. ప్రకాశ్ రాజ్, జీవిత, మంచు విష్ణు, హేమ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న విషయం తెలిసిందే. దీంతో ఒక‌రిపై ఒక‌రు చేసుకుంటోన్న వ్యాఖ్య‌లు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో మా అధ్యక్షుడు నరేశ్‌పై నటి హేమ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఏడాది జరగనున్న ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం రేసులోకి దిగుతున్న హేమ తాజాగా ఎలక్షన్స్‌ గురించి స్పందించారు.

ఈ సారి ‘మా’ అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడాల‌ని కొంద‌రు భావిస్తున్నార‌ని ఆమె ఆరోపించారు. లేదంటే ఎన్నికలు లేకుండా నరేష్‌నే మ‌ళ్లీ అధ్యక్షుడిగా కొనసాగించేందుకు వారు ప్రయత్నిస్తున్నారని ఆమె వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష ప‌ద‌వి నుంచి దిగకుండా ఉండేందుకు నరేష్‌ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

అంతేగాక‌, మా నిధుల‌పై కూడా హేమ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. రూ.5 కోట్ల నిధుల్లో రూ.3 కోట్లు మాత్రమే నరేశ్‌ ఇప్పటివరకు ఖర్చు చేశారని ఆమె చెప్పారు. మిగతా డ‌బ్బంతా ఏమైంద‌ని నిల‌దీశారు. ఈ మేరకు శనివారం 200 మంది అసోసియేషన్‌ సభ్యులకు హేమ లేఖలు రాశారు. ఏది ఏమైనా ఈ ఏడాది ‘మా’ అధ్యక్ష ఎన్నికలు జరిగేలా చూడాలంటూ వారందరి నుంచి ఆమె సంతకాలు సేకరించారు.

- Advertisement -