నోట్ల రద్దుతో యవత్ దేశం అతలకుతలంమైంది… ప్రధాని మోడీ నోట్ల రద్దుతో పెను సంచలనం సృష్టించారు. రూ.500,1000నోట్లు రద్దుతో నల్లకుభేరులకు నిద్రలేకుండా చేశారు. దేశంలో అవినీతి నిర్ములించడానికే ఇలాంటి పని చేసినట్లు మోడీ చెప్పుకొచ్చారు. ఏది ఏమైనప్పటీకి నోట్ల రద్దుతో కొంత మంది సంతోషం వ్యక్తం చేసిన మరికొంత మంది మాత్రం మోడీపై మండిపడ్డారు.
ప్రస్తుతం మార్కెట్లోకి కొత్త వేయ్యిరూపాయిల నోటు రాబోతుందని వార్తలు జోరందుకున్నాయి. ఇప్పటికే వేయ్యినోట్లు ప్రింట్ అయ్యాయని ప్రచారం జరుగుతుంది. జాతీయ మీడియా కూడా త్వరలో కొత్త వేయ్యినోటు వస్తుందని కథనాలు రాసుకొస్తుంది. ఇప్పటికే వేయ్యినోట్ల ప్రింటింగ్ కూడా పూర్తయ్యిందని….ఇక మార్కెట్లోకి విడుదల చేయటానికి ఆర్బీఐ సన్నహాలు చేస్తుందని….కాకపోతే కొన్ని కారణాల వల్ల నోట్ల పంపిణీ వాయిదా వేసినట్లు చెప్పుకొచ్చారు.
అయితే తాజాగా మార్కెట్లోకి కొత్త వెయ్యి రూపాయిల నోటు వస్తుందనే దానిపై ఆర్థిక వ్యవహరాల కార్యదర్శి శక్తికాంతదాస్ స్పందించారు. రద్దయిన వెయ్యినోట్ల స్థానంలో కొత్తవి తెచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ దృష్టంతా కూడా రూ. 500 నోట్లు, తక్కువ విలువ కలిగిన నోట్ల తయారీ, సరఫరాపైనే దృష్టి పెట్టామని ఆయన ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. గత రెండు రోజులుగా సోషల్‌మీడియాలో, నేషనల్ మీడియాలో త్వరలోనే మార్కెట్లోకి కొత్త వెయ్యినోట్లు వస్తాయని వార్తలు రావడంతో శక్తికాంతదాస్ ఈ ట్వీట్ చేశారు.
అంతేకాకుండా ఏటీఏంలలో ఎప్పటికప్పుడు నగదు ఖాళీ అవుతుండడంతో ప్రజలకు సమస్యలు తలెత్తున్నాయని, వీటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు. తమకు ఎంత డబ్బు అవసరమో అంతే మొత్తంలో నగదు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అవసరానికి మించి డబ్బులు డ్రా చేయడం వల్ల అవసరమైనవారికి నగదు అందకుండా పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా గత రెండు రోజులుగా కొత్త వెయ్యినోట్లు మార్కెట్లోకి వస్తున్నాయనే వార్తలకు తన ట్వీట్ ద్వారా బ్రేక్ వేశారు శక్తికాంత్‌దాస్.
ఇప్పట్లో కొత్త వెయ్యి నోట్లు రావు ….
- Advertisement -
- Advertisement -