కార్తీక దీపం…మోనితకు షాకిచ్చిన దీప!

171
karthika deepam
- Advertisement -

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ కార్తీకదీపం. ఇప్పటివరకు 1097 ఎపిసోడ్స్ పూర్తి చేసుకోగా తాజా ఎపిసోడ్‌లో భాగంగా మోనితకు షాకిచ్చిన దీప…తన భర్తను దక్కించుకోవడం నీవల్ల సాధ్యం కాదని తేల్చి చెబుతుంది.

ఆనందరావు మోనితకి ఫోన్ చేసి..రిజిస్టర్ ఆఫీస్‌కి రా కలుద్దాం అంటాడు. సరేనంటుంది మోనిత. ఆనందరావు దగ్గరకు వచ్చి..నమస్కారం మావయ్యగారు అంటే.. అంకుల్‌ని మామయ్యగారు అన్నంత ఈజీ కాదమ్మ కొడుకు స్నేహితురాలు కోడులు కావడం అంటాడు ఆనందరావు కోపంగా. నేను మీ అబ్బాయిని 16 ఏళ్లుగా ప్రేమిస్తున్నాను అంకుల్. పెళ్లి అయితే నూరేళ్లు ప్రేమిస్తాను అంటుంది. అది నీ వ్యక్తిగతం మోనితా.. కానీ పెళ్లి అయిన మగాడ్ని ఇంకా ప్రేమించడాన్ని ఏ సమాజం హర్షించదు..అర్థం చేసుకుని పక్కకు తప్పుకో అంటాడు ఆనందరావు.ఇంతదాకా వచ్చాక నేను వెనకడుగు వెయ్యలేను.. ఈ నెల 25 వరకూ ఆగండి అంకుల్.. అంతా మంచే అవుతుంది అంటుంది మోనిత.

ఇంతలో ఆనందరావ్ మోనితలకు కాస్త దూరంలో దీప కార్తీక్. నా కడుపులో బిడ్డ పెరుగుతోంది. ఆ బిడ్డకు కారణం మీ అబ్బాయే.. ఇప్పుడు మీరు కాదు అనగలరా అంకుల్.. నేను మీ ఇంటికి వారసుడ్ని ఇవ్వబోతున్నాను.. మీరు మళ్లీ తాత కాబోతున్నారు. అందుకే ఈ పెళ్లి. ఈ నిజం బయటపడకుండా మీరు కూడా సాక్షి సంతకం చేసి గుట్టుచప్పుడు కాకుండా ఈ పెళ్లి జరిపించి మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోండి. వస్తాను మావయ్యగారు అంటుంది. ఎదురుగా ఉన్న దీప, కార్తీక్‌లు గుండెనొప్పితో పడిపోతున్న ఆనందరావుని పట్టుకోవడానికి పరుగుతీసి కిందపడకుండా పట్టుకుంటారు.తర్వాత ఆనందరావుని కార్తీక్ హాస్పెటల్‌లోనే జాయిన్ చేస్తారు.

తర్వాత దీప కార్తీక్ హాస్పెటల్ నుంచి బయటికి వెళ్తుంటే.. మోనిత కార్తీక్ భుజంపై చెయ్యివేసి ఆపుతుంది. అర్జెంట్ పని ఉంది.. అరగంటలో వచ్చేద్దాం పదా అనగానే మోనితపై సీరియస్ అవుతాడు కార్తీక్. వెళ్లండి డాక్టర్ బాబు..అది మిమ్మల్ని పెళ్లి పనులకు పిలుస్తోంది కదా.. నేనేమో దాని పెళ్లి పెటాకులు చేసే పనికి తీసుకుని వెళ్లాలి అనుకున్నాను దీప చెప్పగా నేను వెళ్తాను మీరు దాంతో వెళ్లండి.. ఇప్పుడు అంజీ ఉన్నట్టైంతే బాగుండేది.. అంటూ మోనితలో వణుకుపుట్టిస్తుంది. ఒకసారి కాల్ చేసి అర్జెంట్‌గా వచ్చి ఉద్యోగంలో జాయిన్ అయిపోమని చెప్పండి.. దీని పెటాకుల పనిలో నాకు సాయంగా ఉంటాడు.. అంటుంది దీప. అంతేగాదు మోనిత గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోంది దీప. ఇక తర్వాత ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారనుంది.

- Advertisement -