లీడర్‌…కేటీఆర్‌కి తలసాని బర్త్ డే గిఫ్ట్

94
leader

మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోట్ల మొక్కలు నాటనుండగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఇక రామన్న బర్త్ డే సందర్భంగా స్పెషల్ సాంగ్‌ని రిలీజ్ చేయనున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

లీడర్ అనే టైటిల్‌తో 24న కేటీఆర్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ సాంగ్‌ని రిలీజ్ చేయనున్నట్లు తలసాని సాయి వెల్లడించారు. ఇక తన బర్త్ డే సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 100 త్రిచక్క వాహనాలను దివ్యాంగులకు అందించనున్నట్లు వెల్లడించారు కేటీఆర్‌.

ఇక కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో ఎమ్మెల్సీ నవీన్ రావు 100, ఎమ్మెల్సీలు శంబిపూర్ రాజు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి చెరో 60, మంత్రి పువ్వాడ అజయ్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ చెరో 50, ఎంఎల్ల్యే గువ్వల బాలరాజు గాదరి కిషోర్ 20, త్రిచక్ర వాహనాలను కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా అందించేందుకు ముందుకు వచ్చారు.