అమిత్ షా రాజీనామా చేయాలి: రాహుల్

92
rahul

పెగాసన్ హ్యాకింగ్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్‌పై స్పందించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. తన ఫోన్ కూడా ట్యాప్ అయిందని… తాను జ‌రుపుతున్న అన్ని సంభాష‌ణ‌ల‌ను మానిట‌ర్ చేసిన‌ట్లు ఆయ‌న ఆరోపించారు.

దీనికి నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు రాహుల్. ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి త‌న‌కు ఫోన్స్ వ‌స్తుంటాయ‌ని, వాళ్లు త‌న ఫోన్ ట్యాప్ చేశార‌ని, త‌న సెక్యూర్టీని కూడా త‌న గురించి అడిగేవార‌న్నారు. ట్యాపింగ్‌ విష‌యంలో జ్యుడిషియ‌ల్ విచార‌ణ‌కు ఆదేశించాల‌న్నారు.

పెగాస‌స్ స్పైవేర్‌ను ఇజ్రాయిల్ ప్ర‌భుత్వం ఓ ఆయుధంగా ప‌రిగ‌ణిస్తుంద‌ని, అలాంటి ఆయుధాన్ని సాధార‌ణంగా ఉగ్ర‌వాదుల‌పై వాడాల‌ని, కానీ ఈ దేశ ప్ర‌ధాని, హోం మంత్రులు.. వాటిని భార‌తీయ వ్య‌వ‌స్థ‌లు, వ్య‌క్తుల‌పై వాడిన‌ట్లు రాహుల్ మండిపడ్డారు.