పోర్న్ రాకెట్ కేసులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్‌కుంద్రాను ముంబై క్రైం బ్రాంచీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో రాజ్‌కుంద్రా తరపున లాయర్ కోర్టులో తన వాదనలు వాదించారు. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని 67ఏ సెక్షన్ ను రాజ్‌కుంద్రాపై మోపడం సరైంది కాదన్నారు.
ఐటీ చట్టాలను.. ఐపీసీ సెక్షన్లతో కలపరాదు అని, కానీ ముంబై పోలీసులు ఆ పనిచేశారని, ఇద్దరి మధ్య జరిగే శారీరక కలయిక మాత్రమే పోర్న్‌గా భావించాలని, మిగితా వాటిని కేవలం బూతుగా పరిగణించాలన్నారు. సంభోగం నిజం కానప్పుడు.. దాన్ని నీలి చిత్రంగా భావించరాదని వెల్లడించారు. అది కేవలం వెబ్ సిరీస్ మాత్రమేనని తెలిపారు.
ఇప్పటి వరకు ఈ కేసులో 11 మందిని అరెస్టు చేశారు. మంగళవారం ర్యాన్ థోర్ప్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. నటి గెహనా వసిస్ట్ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.