బ్లూ ఫిల్మ్ కేసు… శిల్పా శెట్టి భర్త అరెస్ట్

62
shilpa

బాలీవుడ్ న‌టి శిల్పా శెట్టి భ‌ర్త, వ్యాపార‌వేత్త రాజ్ కుంద్రాను అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. పోర్న్ వీడియోలో తీసిన కేసులో ఆయ‌న్ను అదుపులోకి తీసుకున్నారు. ఔత్సాహిక న‌టీన‌టుల‌తో అశ్లీల చిత్రాలు తీయించి.. వాటిని విదేశీ యాప్‌ల్లో అప్‌లోడ్ చేసిన కేసులో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు కుంద్రాను అరెస్టు చేశారు.

ఈ కేసులో విచార‌ణ కొన‌సాగుతోంద‌ని ముంబై క‌మిష‌న‌ర్ హేమంత్ న‌గ‌రేల్ తెలిపారు. కుంద్రాతో పాటు ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ది మందిని అదుపులోకి తీసుకున్నారు.ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ల కోసం షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నామ‌న్న నెపంతో వాళ్లు పోర్న్ వీడియ‌లు తీశారు. భార‌తీయ చ‌ట్టాల నుంచి త‌ప్పించుకునేందుకు ఆ అశ్లీల చిత్రాల‌ను అక్క‌డి యాప్స్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఈ కేసులో ఉమేశ్ కామ‌త్‌ను అరెస్టు చేసిన త‌ర్వాతే.. ఆ పోర్న్ రాకెట్‌లో కుంద్రా పాత్ర ఉన్న‌ట్లు తేలింద‌ని పోలీసులు వెల్లడించారు.

ఉమేశ్ కామ‌త్ అనే నిందితుడు .. వియాన్ ఇండ‌స్ట్రీస్‌లో డైర‌క్ట‌ర్‌గా చేశారు. దాంట్లో కుంద్రా చైర్మ‌న్‌గా ఉన్నారు. పోర్న్ వీడియోలు షూట్ చేసేందుకు వాడిన సుమారు 6 ల‌క్ష‌ల విలువైన‌ ప‌రిక‌రాల‌ను పోలీసులు సీజ్ చేశారు. శిల్పా శెట్టి, రాజ్‌కుంద్రాలు.. 2009, న‌వంబ‌ర్ 22న పెళ్లి చేసుకున్నారు.