అఖిలపక్ష నేతలతో కేంద్ర ప్రభుత్వం భేటీ..

103
- Advertisement -

సోమవారం నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆదివారం అఖిలపక్ష నేతలతో కేంద్ర ప్రభుత్వం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి వివిధ పార్టీల నేతలు హాజరైయ్యారు. టీఆర్ఎస్ పార్టీ తరపున పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు, లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు హాజరైయ్యారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది.

కాగా, సోమవారం ఉద‌య‌దం 11 గంట‌ల‌కు పార్లమెంటు స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. సభ్యుల్లో అధిక శాతం మంది ఇప్ప‌టికే క‌రోనా టీకాలు తీసుకున్నారు. సాగుచట్టాలపై రైతుల ఉద్య‌మం, క‌రోనా ప‌రిస్థితులు, నిరుద్యోగం వంటి అంశాలు ఈ స‌మావేశాల్లో కీల‌కం కానున్నాయి. అలాగే, పెట్రో ఉత్పత్తుల ధరలపై ప్ర‌తిప‌క్షాలు గ‌ట్టిగా నిల‌దీసే అవ‌కాశం ఉంది.

- Advertisement -