కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ సమావేశం..

75
Congress

ఈ రోజు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్లమెంట్ స్ట్రాటజీ గ్రూప్ సమావేశం జరిగింది. ఒక గంట పాటు సమావేశం కొనసాగిందని సమాచారం. ఈ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ మీట్‌లో మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రస్తుతం దేశంలో నెలకొని ఉన్న పరిస్థితుల ఆధారంగా పలు అంశాలను పరిగణలోకి తీసుకుని చర్చించారు. 

ఈ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ పాల్గొని ప్రసంగించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు కాంగ్రెస్ పార్టీ ఐదు పాయింట్ల ఎజెండా రూపొందించింది. అందులో రైతుల ఆందోళన, ఇంధన ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, కరోనా పరిస్థితుల నిర్వహణ వైఫల్యం, సరిహద్దు సమస్యలతో ఎజెండాగా తీసుకుంది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ మిత్రపక్ష పార్టీలతో సమన్వయం చేయనున్నదని మల్లికార్జున్ ఖర్గే తెలిపారు.ఏజెండాలోని అన్ని అంశాలపై ఉభయసభల ఎంపీలు కలికట్టుగా పోరాడాలని అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశించారు. మొత్తానికి ఈ వర్షాకాల పార్లమెంటరీ సమావేశాల్లో దేశంలోని ప్రధాన సమస్యలపై బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయడానికి కాంగ్రెస్ నేతలు గట్టిగానే ప్రణాళికలు వేసుకుంటున్నారు.