పెళ్లి పీటలెక్కనున్న ఉపాసన చెల్లెలు..

271
Anushpala Kamineni

అపోలో ఫౌండేషన్ వీసీ.. ఎంటర్ ప్రెన్యూర్ ఉపాసన కామినేని టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉపసనా కామినేని చెల్లెలు అనుష్పాల కామినేని తన ప్రేమ వివాహానికి సంబంధించిన కబురును అందించారు. ఆమె అథ్లెట్ అర్మాన్ ఇబ్రహీంతో ప్రేమలో ఉంది. ఈ జంట నిశ్చితార్థం కూడా పూర్తయింది. తాజాగా ఉపాసన ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. ‘నా డార్లింగ్స్‌కి అభినందనలు’ అంటూ ఆమె ఓ షోటో షేర్‌ చేసింది.. దీంతో ఆ జంట‌కు తమన్నా, కాజల్, లక్ష్మీ మంచు, ఛార్మీ, అల్లు స్నేహా, శ్రియా భూపాల్, రకుల్ ప్రీత్ సింగ్ ఈ జంటకు విషెస్ తెలిపారు.