దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 17,40,325 కరోనా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో మొత్తం 43,40,58,138 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు తాజా ప్రకటనలో పేర్కొన్నారు. ఇక దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 31,443 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 118 రోజుల్లో ఇదే అత్యల్పం.
సెకండ్ వేవ్ తర్వాత ఇంత తక్కవ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇండియాలో రికవరీ రేటు 97.28 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పింది. ప్రస్తుతం దేశంలో 4,31,315 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇది 109 రోజుల్లో అత్యల్పం అని పేర్కొన్నారు. అయితే గత 24 గంటల్లో కోవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 2020గా ఉన్నట్లు ఆరోగ్యశాఖ చెప్పింది. మధ్యప్రదేశ్‌లోనే 1481 మంది కోవిడ్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు.