ఓటీటీలో వెంకటేష్ ‘దృశ్యం 2’..?

93
Drushyam 2

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్… వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం వెంకటేష్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘దృశ్యం 2’. ఈ సినిమాను సురేష్ ప్రోడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు నిర్మిస్తున్నాడు. మీనా, వెంటకేష్ ప్రధాన పాత్రలు చేస్తుండగా.. నదియా మరో కీలకపాత్రలో కనిపించనుంది. ఇక ఈ మూవీ ఓటీటీలోనే విడుదల చేయనున్నారనే టాక్ వచ్చింది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వారికే ఇవ్వనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత డిస్నీ హాట్ స్టార్ వారితో చర్చలు జరుగుతున్నట్టుగా చెప్పుకున్నారు. వాళ్లతోనే డీల్ కుదిరిందనేది తాజా సమాచారం.

అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన రావలసి ఉంది. మలయాళ ‘దృశ్యం 2’ కూడా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ పైనే విడుదలై అనూహ్యమైన విజయాన్ని అందుకుంది. కథాబలం కలిగిన ఈ సినిమాకి తెలుగులోను విశేషమైన ఆదరణ లభించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మలయాళంలో దృశ్యం 2ను డైరెక్ట్ చేసిన అదే దర్శకుడు జీతూ జోసెఫ్ తెలుగులో కూడా తెరకెక్కిస్తున్నాడు.