బాలానగర్‌ ఫ్లైఓవర్ ప్రారంభం..

154
ktr
- Advertisement -

గ్రేటర్ పరిధిలో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు 2017లో శంకుస్థాపన చేసిన బాలానగర్ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తికాగా ఇవాళ ప్రారంభించారు మంత్రి కేటీఆర్. తలసాని, మల్లారెడ్డిలతో కలిసి ప్రారంభించగా ఈ బ్రిడ్జికి బాబూ జగ్జీవన్ రామ్‌ ఫ్లై ఓవర్‌గా నామకరణం చేశారు.

బాలానగర్ డివిజన్‌లోని నర్సాపూర్‌ చౌరస్తా రద్దీగా ఉంటుంది. కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌, జీడిమెట్ల వెళ్లే దారిలో హేవీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతోంది. ఈ ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెట్టేందుకు 2017 ఆగస్టు 21న బాలానగర్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.

సుమారు 385 కోట్లు వెచ్చించి నాలుగేళ్లలో బ్రిడ్జి నిర్మాణం పూర్తిచేశారు. 1.13 కిలోమీటర్ పొడవున్న ఈ ఫ్లైఓవర్‌ని 24మీటర్ల వెడల్పు, 26పిల్లర్లతో నిర్మించారు. ఆరు లేన్లతో నగరంలో నిర్మించిన తొలి ఫ్లై ఓవర్ ఇదే కావడం గమనార్హం. 2050 సంవత్సరం వరకు ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకుని దీన్ని నిర్మించారు.

- Advertisement -