రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 15 సంవత్సరాలలో మొదటిసారి రైలులో ప్రయాణించబోతున్నారు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు రాష్ట్రపతి ఢిల్లీ నుంచి ఉత్తర ప్రదేశ్‌లోని తన సొంత నగరానికి ప్రయాణించనున్నారు. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేక రైలులో ఆయన బయలుదేరనున్నారు. ఈ ప్రయాణంలో భాగంగా రెండు ప్రాంతాల్లో పర్యటిస్తారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ జన్మించిన పరాంఖ్ గ్రామానికి సమీపంలోని జిన్జాక్, రురా రెండు గ్రామీణాప్రాంతాల్లో పర్యటించనున్నారు.
రాష్ట్రపతి తన పాత పరిచయస్తులు, పాఠశాల రోజుల నుండి తెలిసిన వారిని కలవనున్నారు. ఇక రాష్ట్రపతి గౌరవార్థం జూన్ 27న రెండు కార్యక్రమాలు నిర్వాహించనున్నారు. అలాగే జూన్ 28న కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి రైలులో లక్నోకు బయలుదేరనున్నారు రాష్ట్రపతి. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో ఆయన రెండు రోజుల పర్యటించనున్నారు. అనంతరం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్నారు.